తెలంగాణ హోం గార్డులకు షాక్‌..ఇంకా అందని జీతాలు !

-

తెలంగాణ హోం గార్డులకు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో హోం గార్డులకు ఇంకా కూడా జీతాలు అందలేదట. గత నెల 20న హోం గార్డులకు జీతాలు వేసింది కాంగ్రెస్‌ సర్కార్‌. కానీ ఈ నెలలో తెలంగాణ రాష్ట్ర హోం గార్డులకు ఇంకా కూడా జీతాలు అందలేదట. దసరా, బతుకమ్మ పండగ వేళ ఆశగా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు హోమ్ గార్డులు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక్క నెల కూడా సరిగా సమయానికి జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర హోం గార్డులు.

కేసిఆర్ ఉన్న సమయంలో టంచన్ గా ఒకటో తేదీనే వచ్చాయని తెలంగాణ రాష్ట్ర హోం గార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్‌ వచ్చాక తమకు సరైన సమయంలో జీతాలు రావడం లేదని ఆందోలన చెందుతున్నారు తెలంగాణ రాష్ట్ర హోం గార్డులు. మరి తెలంగాణ రాష్ట్ర హోం గార్డుల సమస్యలపై రేవంత్‌ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news