మియాపూర్‌లో హత్యకు గురైన మైనర్ బాలిక ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.చింటూ అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్‌లో ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి నాటకంతో హత్య చేశాడు.పోలీసుల విచారణలో అతను గతంలో దొంగతనం కేసుల్లో జైలుకెళ్లినట్లు తేలింది.బాలిక కుటుంబ సభ్యుల్ని తప్పుదారి పట్టించేందుకు చింటూ రకరకాల ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. నవంబర్ 8న ఉదయం బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింటూ పుస్తెలతాడు, పూలదండలు కొని.. తన స్నేహితుడి ఇంట్లోనే తాళి కట్టి దండలు మార్చుకున్నారు. ఫొటోలు దిగి వాటిని స్నేహితులు, బాలిక కుటుంబ సభ్యులకు,స్నేహితురాలికి పంపాడు. తమకు పెళ్లైందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి హత్యకు ప్లాన్ చేశాడు.
తన స్నేహితుడు, అతని వైఫ్ బయటికి వెళ్లాక బాలికను హతమార్చాడు.వారిద్దరూ ఇంటికి వచ్చాక బాలిక డెడ్ బాడీని మాయం చేయాలనుకున్నాడు.బాలికను చంపిన తర్వాత..ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న చింటూ బాలిక కనిపించడం లేదని నాటకం మొదలుపెట్టాడు.ఆమె కోసం వెతుకుతున్నట్లు ఫ్రెండ్స్‌కు చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు చింటూను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు.