వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త. ఇకపై వేములవాడలో నిత్యాన్నధానం కొనసాగనుంది. వేములవాడ లో అన్నదానం కేంద్రం కి 35 కోట్లు మంజూరు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇవాళ వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన తరుణంలోనే… వేములవాడ లో అన్నదానం కేంద్రం కి 35 కోట్లు మంజూరు చేసింది సర్కార్.
ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి కోసం రూ.127.65 కోట్లు మంజూరు చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ.47.85 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.