Siddipet traffic ACP caught in drunk and driving: పోలీసుల పరువు తీశాడు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్.. అండంగా దొరికిపోయాడు. ఈ సంఘటన హైదరాబాద్ – మధురానగర్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ – మధురానగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డాడు.

బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించకుండా అధికారులను అడ్డుకున్న సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్… రెచ్చిపోయి ప్రవర్తించాడు. తాగి వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్ పోలీసుల తో వాగ్వాదానికి దిగాడు. ఈ తరునంలోనే సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.