కార్తీక పౌర్ణమి నాడు ఇలా చేస్తే మీకు తిరుగు ఉండదు.. మీ కష్టాలన్నీ తీరిపోతాయి..!

-

కార్తీకమాసం పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం. కార్తీక మాసంలో కొన్నిటిని ఆచరించడం వలన సంతోషంగా ఉండొచ్చు అనేక సమస్యలు తొలగిపోతాయి. హిందువులకి కార్తీకమాసం అంటే ఎంతో ఇష్టం. కార్తీకమాసంలో కొన్ని ఆచరించడం వలన కష్టాల నుంచి గట్టెక్కొచ్చు. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో వారంతా సంతోషంగా ఉండడానికి అవుతుంది. కార్తీక పౌర్ణమి నాడు దీప దానం చేస్తే చాలా మంచిది. ఉదయాన్నే సముద్ర స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది.

సముద్ర స్నానం చేయడం వలన దృష్టి దోషం నరపీడ లాంటి సమస్యలు రావు. ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ 365 వత్తులు లేదా 720 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. సంవత్సరం మొత్తం దీపం పెట్టిన పుణ్యం కలుగుతుంది. అదే ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపాన్ని పెడితే శుభాలు కలుగుతాయి. ఆంజనేయస్వామి కార్తీక పౌర్ణమి నాడు లంకా దహనం చేశారు. అలాగే చాలామంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణంలో ఉంది.

కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయను దానం ఇస్తే మంచిదట. గృహ యోగం కలగాలంటే పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, జాకెట్ ముక్క పెట్టి ముత్తైదువులకి తాంబూలం ఇస్తే మంచిది. పెళ్లి అవ్వాల్సిన అమ్మాయిలు కార్తీక పౌర్ణమినాడు తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి రాధాకృష్ణుల ఫోటోని పెట్టి దీపం వెలిగించాలి. పువ్వులు, తీయని ఆహార పదార్థాలతో నైవేద్యం పెట్టాలి. ఇలా చేస్తే పెళ్లి అవుతుంది. మంచి భర్తను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news