మలబద్ధకం అనేది చాలామందిని వేధిస్తున్న సమస్య. మార్నింగ్ లేవగానే కడుపు ఖాళీ అవ్వడానికి కష్టపడాల్సి వస్తుంటే.. అనేక అనారోగ్య సమస్యలు శరీరాన్ని చుట్టుముడతాయి. అందుకే ఈ సమస్యను తొందరగా దూరం చేసుకోవాలి.
మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలంటే ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. దీనివల్ల పేగుల్లో కదలికలు చురుగ్గా కదిలి మలబద్ధకం సమస్య మనల్ని దరిచేరదు.
ప్రస్తుతం మలబద్ధకాన్ని దూరం చేసే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
అవిసె గింజలు:
వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అవిసె గింజలను డైలీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. డైలీ ఉదయం అవిసె గింజలను బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే బాగుంటుంది.
చిక్కుడు:
ఒక వారంలో కనీసం మూడు రోజులపాటు చిక్కుడును ఆహారంలో భాగం చేసుకుంటే మలబద్ధకం సమస్యను శాశ్వతంగా దూరం చేసే అవకాశం ఉంటుంది. ఈ కూరగాయలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల పేగుల్లో కదలికలు చురుగ్గా ఉంటాయి.
స్వీట్ పొటాటో:
తోలు కలిగిన స్వీట్ పొటాటోని ఉడకబెట్టి తినడం వల్ల శరీరానికి 3.76 గ్రాముల ఫైబర్ అందుతుంది. ఇందులో ఫైబర్ మాత్రమే కాదు విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. స్వీట్ పొటాటోని రకాలుగా తినవచ్చు. ఫ్రై చేయవచ్చు, ఉడకబెట్టవచ్చు. బ్రెడ్ తో కలుపుకొని మరీ తినవచ్చు.
అత్తి పండు లేదా అంజీర్ :
ఎండిన అత్తిపండ్లలో 1.86 గ్రాముల ఫైబర్ ఉంటుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. మలబద్ధకాన్ని నివారించడంలో అత్తి పండ్లు ఎంతగానో సహాయం చేస్తాయి. అరటి పండ్లను ఫ్రూట్ సలాడ్ తో తీసుకోవచ్చు. లేదా.. వాటిని ఉడకబెట్టి జామ్ లాగా తయారు చేసుకుని సాండ్విచ్, పిజ్జా వంటి వాటిల్లో కలుపుకోవచ్చు.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.