శ్రీరాముడికి.. మోడీకి పోలికనా..? : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

-

శ్రీరాముడికి.. మోడీకి పోలికనా..? అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..   ఇచ్చిన మాట కు కట్టుబడి ఉన్న వ్యక్తి శ్రీరాముడు. దేశం కోసం ప్రాణం ఇచ్చిన ఇందిరా గాంధీ దేశ భక్తురాలు కాదా..? వాజ్ పాయి.. ఇందిరా గాంధీని అపరకాళీ అని పొగిడారు.  పాకిస్థాన్ ని మట్టికరిపించింది కాంగ్రెస్.

దేవుడి పేరు చెప్పుకుని ఓట్లు అడగడం కాదు..శ్రీరాముడి పాలనని ఆదర్శం గా తీసుకోండి.15 లక్షల నల్లధనం పేదల అకౌంట్ లో వేస్తా అన్నారు..వేశారా..? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇచ్చారా..మీరు ఎక్కడ వికసిత్ భారత్.. రైతులు మద్దతు ధర కోసం ధర్నా చేస్తుంటే కాల్చిన మీరా మాట్లాడేది అని ుప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరులు ఐతరు అంటున్నారు బీజేపీ వాళ్ళు.. ఆధాని..అంబానీ ల లోన్లు మాఫీ మాత్రం చేస్తారు. వికసిత్ భారత్ ఎక్కడా.. పెట్టుబడి దారుల ఇండ్లలో..ఆడిన మాట తప్పని వాడు శ్రీరాముడు..మోడీకి పొలికనా దేవుడి తో మోడీ ని పోల్చుకుంటున్నారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే.. రాముల వారి విగ్రహాన్ని తీసి..మోడీ బొమ్మలు పెట్టి కీర్తిస్తారు

Read more RELATED
Recommended to you

Exit mobile version