పాలమూరు బాగు పడాలంటే బిజెపి తోనే సాధ్యం : ఎంపీ డా. లక్ష్మణ్

-

పాలమూరు బాగు పడాలంటే బిజెపి తోనే సాధ్యం అన్నారు రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్. విజయ సంకల్ప యాత్ర సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి ఎంపీ డా లక్ష్మణ్ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా అర్హులైన పేద వారికి ఉచితంగా రేషన్ ద్వారా బియ్యం అందిస్తుంది కూడా మోడీ ప్రభుత్వమే.. రైతులకు ఎరువులు ఉచితంగా అందించి వారికి సహకరించి రైతుల పక్షణా నిలిచింది మోడీ ప్రభుత్వం. ఏ తల్లులు పొగ గొట్టంతో ఊది వంట చేస్తూ ఇబ్బంది పడకూడదని మన మోది ఉజ్వల పధకం ద్వారా గ్యాస్ సిలిండర్ అందించారు.

గత బీఆర్ఎస్  ప్రభుత్వంలో పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ పేర్కొన్నాడు. బొంబాయి బొగ్గుబాయి వలసలు లేకుండా పాలమూరు ను మారుస్తా అని కేసీఆర్ ప్రగాల్బాలు పలికాడు. గెలిచిన తరువాత పాలమూరు ప్రజలను మోసం చేశాడు. ఇంకా పాలమూరు లో వలసలు కొనసాగుతున్నాయి. ఏ లేబర్ అడ్డా ల మీద చూసినా పాలమూరు బిడ్డలే కనిపిస్తున్నారు. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ కి పాలమూరు ప్రజలు బుద్ధి చెప్పారు. పాలమూరు బాగు పడాలంటే బిజెపి తోనే సాధ్యం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు ప్రజలను మోసం చేస్తుంది. ఎన్నికల్లో గెలిచే వరకు ఒకలాగా.. గెలిచిన తరువాత మరోలాగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది. ఒడ్దు చేరేవరకు ఓడ మల్లయ్య.. ఒడ్డూ చేరాక బోడ మల్లయ్య అన్నట్టు ఉంది కాంగ్రెస్ సంగతి. ఆరు గ్యారెంటిల పేరిట మభ్య పెట్టిన కాంగ్రెస్.. అది అమలు చేయడానికి మాత్రం వెనుకాడుతుంది. తెలంగాణ బాగుండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version