సింగరేణిలో గుర్తింపు కార్మికసంఘం ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నో చెప్పడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
హైకోర్టు ఆదేశాలతో రేపు ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2017లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాలపరిమితి 2017 అక్టోబర్ తో ముగిసింది. ఈ తరుణంలోనే..సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విదంగా కృషి చేస్తామని వివరించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బా బు.