సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

-

Singer Rahul Sipligunj gets Rs 1 crore reward: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట ద్వారా ఆస్కార్ స్థాయి వరకు ఎదిగారు రాహుల్ సిప్లిగంజ్‌.

Singer Rahul Sipligunj gets Rs 1 crore reward
Singer Rahul Sipligunj gets Rs 1 crore reward

గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్‌కు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి.

ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంలో సైతం రాహుల్ సిప్లిగంజ్‌ను ప్రస్తావిస్తూ, త్వరలోనే ప్రభుత్వ ప్రకటన ఉంటుందని తెలిపారు రేవంత్ రెడ్డి. తాజాగా బోనాల పండుగ నేపథ్యంలో కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది ప్రభుత్వం. దింతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news