YCP issues notices to Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. అంబటి రాంబాబుకు నోటీసులు ఇష్యూ అయ్యాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నోటీసులు జారీ చేశారు సత్తెనపల్లి పోలీసులు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారని అంబటిపై కేసు అయింది.

జులై 21న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు… ఈ మేరకు అంబటి రాంబాబుకు నోటీసులు ఇష్యూ చేశారు. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు విడుదల రజినీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విడుదల రజినీకి తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. విడదల రజినీకి పలనాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు.