చేనేత జౌళి శాఖ కార్యాలయం ముట్టడికి సిరిసిల్లా కార్మికులు బయలు దేరారు. ఈ తరుణంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవ్వాళ హైదరాబాద్ చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు….తెల్లవారు జామున ఐదు గంటలకు హైదరాబాద్ వెళ్లకుండా పలువురిని అరెస్ట్ చేశారు. డిమాండ్ల సాధనకు హైదరాబాద్ వెళుతున్న వారిని అడ్డుకున్నారు పోలీసులు.
గత ప్రభుత్వం ఒక మీటర్ బట్టకు రూపాయలు 1.42 పైసలు యథావిధిగా డబ్బులు చెల్లించాలని… కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్ బట్టకు 30 పైసలు మాత్రమే చెల్లిచడంతో నేత కార్మికులు రోడ్డున పాడుతారని ఫైర్ అవుతున్నారు కార్మికులు. నేతన్న చేయూత (త్రిఫ్టు) పథకం పాత పద్ధతిలో కొనసాగించాలి….బతుకమ్మ చీరల యరన్ 10% సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. జౌళిశాఖ కార్యదర్శి సిరిసిల్ల నేత కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడంతో నేత కార్మికులు తీవ్రంగా నష్టపోతారు….నేత కార్మికులకు బతుకమ్మ చీరెలు ఆర్డర్, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మేము అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు కార్మికులు.