కొమురం భీం జిల్లా అటవీ శాఖ అధికారుల పై సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలోఉన్న అటవీశాఖ అధికారులకు ట్రాకింగ్ వ్యవస్థ మీద అవగాహన లేదని చురకలు అంటించారు. పక్కన మహారాష్ట్రకు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడోబా, తిప్పేశ్వర లో వందల సంఖ్యలో పులులు ఉన్న అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
అటవిశాఖ అధికారులు ఎంత సేపు డబ్బులు వసులు చేసే పనుల్లో ఉంటున్నారని.. ఎలాంటి అవగాహన లేదని మండిపడ్డారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం డ్రామాలు చేస్తున్నారని… అవినీతిని అధికారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని ఆరోపణలు చేశారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు. అక్రమ సంపాదన మీద నే దృష్టి తప్పా ప్రజలు ప్రజల ప్రాణాల మీద లేదని చురకలు అంటించారు సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు.