పేపర్ లీకేజీ వ్యవహారం.. TSPSC కి రేపు నివేదిక ఇవ్వనున్న సిట్‌

-

రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తును ముమ్మరం చేసింది. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సుమారు 2 గంటలపాటు సిట్‌ అధికారి ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలోని నేర విభాగ అదనపు సీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. ప్రశ్నాపత్రం లీకైన సెక్షన్‌లో వివరాలు సేకరించిన అధికారులు.. ఎన్ని పేపర్లు లీక్‌ అయ్యాయి అనే కోణంలో విచారణను ప్రారంభించారు.

ముఖ్యంగా ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ క్యాబిన్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. దర్యాప్తులో భాగంగా కార్యాలయంలోని పలువురి కంప్యూటర్లను సిట్‌ అధికారులు పరిశీలించారు. ఈ విషయంపై టీఎస్‌పీఎస్సీకి రేపు నివేదిక ఇవ్వనున్నట్లు సిట్‌ చీఫ్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఛైర్మన్‌, కార్యదర్శి పేషీల్లోని సిబ్బంది వివరాలను సిట్‌ చీఫ్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రవీణ్‌తో ఎక్కువగా ఎవరెవరు కలిసి ఉంటారనే విషయాలపై ఎక్కువగా సిట్‌ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కార్యాలయంలోని సాంకేతిక నిపుణుల నుంచి టీఎస్‌పీఎస్సీ సర్వర్ల వివరాలను సైతం అడిగి తెలుసుకుని విచారించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version