వాళ్లతో కలిసి ఎక్కడెక్కడ తిరిగారు?.. శ్రీనివాస్‌ను ప్రశ్నించిన సిట్‌

-

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో న్యాయవాది శ్రీనివాస్‌కు సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. నందకుమార్‌, సింహయాజీతో కలిసి ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో చెప్పాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్‌ వద్ద శ్రీనివాస్‌ రూ.55 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపిన సిట్‌ అధికారులు.. ఆ అప్పుకు సంబంధించి నెలకు రూ.1.10 లక్షలు వడ్డీ చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డీ చెల్లించడానికి వాడిన గూగుల్‌ పే, ఫోన్‌ పే వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఎక్కడికి వెళ్లినా తనకు నందూనే టికెట్లు బుక్‌ చేస్తారని శ్రీనివాస్‌ చెప్పగా.. నందూ, సింహయాజితో ఎక్కడెక్కడ ప్రయాణించారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నందకుమార్‌ బుక్‌ చేసిన విమాన టికెట్ల వివరాలు ఇవ్వాలన్నారు. రేపు విచారణకు హాజరుకావాలని.. వచ్చేటప్పుడు పలు వివరాలు తీసుకురావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు

జులై వరకు వాడిన మరో ఫోన్ అప్పగించాలని శ్రీనివాస్‌కు సిట్ స్పష్టం చేసింది. పాత ఫోన్ పగిలినందున జూన్ 1న కొత్తది కొన్నట్లు ఆయన తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసినట్లు చెప్పారు. సిట్‌కు అప్పగించిన మొబైల్‌లోనే ట్రావెల్ ఏజెన్సీ వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. అదే విధంగా శ్రీనివాస్, ఆయన భార్య బ్యాంకుల ఖాతాల వివరాలు, పాస్‌పోర్టు ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version