తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ.. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిని ప్రకటించడంలో మాత్రం కాస్త ఆలస్యమే జరుగుతోంది. ఢిల్లీ టు హైదరాబాద్ రాజకీయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ గేటు వద్ద కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ఆత్మహత్యాయత్నం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొంతమంది యువకులు రేవంత్ రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
మరోవైపు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సీఎం అవకాశం ఇవ్వాలని ఎఐసిసి పరిశీలకుల వద్ద చెప్పినట్టు సమాచారం. పార్టీ అంతర్గతంగా చర్చించే అంశాలు సున్నితమైనవి కాలంతో బహిర్గతం చేయలేకపోతున్నామని వెల్లడించారు. ఏదిఏమైనాప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి ఫైనల్ అయ్యే అవకాశము కనిపిస్తోంది. డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ప్రకటించనున్నట్టు సమాచారం.