తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పీఆర్ఓ కుటుంబ పాలన కొనసాగుతున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ సంచలన విషయాలను బయట పెట్టింది. ఉపాధి హామీ పథకంలాగా సీఎం పీఆర్ఓ బోరెడ్డి అయోధ్య రెడ్డి కొడుకుకి సోషల్ మీడియా కాంట్రాక్ట్? ఇచ్చినట్లు బీఆర్‌ఎస్ పార్టీ చెబుతోంది. సోషల్ మీడియాలో కొంత మందితో టీం ఏర్పాటు చేసుకొని, అధికార పక్షానికి అనుకూలంగా ట్రోలింగ్ ఆర్మీ నడుపుతున్నారట బోరెడ్డి అభ్యుదయ రెడ్డి.
ప్రతిపక్ష నేతలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను ఎటాక్ చేయాలని ఆదేశాలు కూడా బోరెడ్డి అభ్యుదయ రెడ్డి ఇచ్చారని బీఆర్‌ఎస్ పార్టీ సంచలన విషయాలను బయట పెట్టింది. గతంలో Bar Talkies అంటూ సదరు పుత్రరత్నం ట్విట్టర్ హ్యాండిల్‌ను నడపగా అందరూ దాన్ని ఎత్తి చూపి ట్రోల్ చేయడంతో ఇటీవలే హ్యాండిల్ పేరు తన సొంత పేరు అభ్యుదయ బోరెడ్డిగా మార్పు చేశారని బీఆర్‌ఎస్ పార్టీ పేర్కొంది. ఇదేం కుటుంబ పీఆర్ఓ పథకం అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నట్లు కూడా బీఆర్‌ఎస్ పేర్కొంద.