రష్యా ఆర్మీ చెర నుంచి బయటపడ్డ తెలుగు యువకుడు..!

-

ఎట్టకేలకు రష్యా ఆర్మీ చెర నుంచి బయట పడ్డాడు తెలుగు యువకుడు సోఫీయాన్. 8 నెలలుగా రష్యా ఆర్మీ చేతిలో బంధీగా ఉన్న సోఫీయాన్.. నారాయణపేట జిల్లాకి చెందిన వాడు.
ఇప్పుడు క్షేమంగా ఇండియా కి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న సోఫియాన్ ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు పేరెంట్స్, బంధువులు సోఫియాన్ తోపాటు రష్యా ఆర్మీ చేతిలో బంధీ అయిన యువకుడు అఫ్రిది చనిపోవడంతో సోఫియాన్ కుటుంబంలోనూ ఆందోళన మొదలయింది. కానీ ఇప్పుడు కొడుకు క్షేమంగా తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు పేరెంట్స్.

ఉద్యోగం పేరుతో లక్షల రూపాయలు దండుకుని.. రష్యా పంపాడు ముంబైకి చెందిన ఓ ఏజెంట్. ముంబై ఏజెంట్ చేతిలో మోసపోయి.. రష్యా ఆర్మీ చేతిలో బంధీ అయ్యారు 9 మంది భారతీయ యువకులు. ఇందులో హైదారాబాద్ కి చెందిన యువకుడు అఫ్రిదీ మృతి చెందాడు. బంధీ చేసిన యువకులకు ట్రెయినింగ్ ఇచ్చి.. ఆయుధాలు చేతపట్టించి ఉక్రెయిన్ బార్డర్ లో గస్తీ కోసం వాడింది రష్యా ఆర్మీ. అయితే తమను రష్యా ఆర్మీ బంధించి.. ఉక్రెయిన్ బార్డర్ లో కాపలా గా పెట్టిందని 6 నెలల క్రితం వీడియో పంపారు యువకులు. అప్పటి నుండి యువకులను క్షేమంగా రప్పించడం కోసం.. నానా తంటాలు పడ్డారు పేరెంట్స్.

Read more RELATED
Recommended to you

Latest news