మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. మేడారం జాతరకు భక్తుల రద్దీ దృష్ట్యా టిఎస్ఆర్టిసి భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారంకు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే 6వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
మేడారం జాతర ఈనెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా…. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. అలాగే ఈ నెల 9 నుంచి అంటే నేటి నుంచే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు టిఎస్ఆర్టిసి రంగారెడ్డి రీజినల్ మేనేజర్ ఏ శ్రీధర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంజిబిఎస్ నుంచి మూడు బస్సులు, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి 2 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పెద్దలకు రూ. 750, పిల్లలకు రూ.450గా బస్సు ఛార్జీలను నిర్ణయించామన్నారు. టిఎస్ఆర్టిసి ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు.