ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ పై మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు… వైద్యులతో మాట్లాడి మాగంటి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ పై మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానన్నారు. నిన్నటి కంటే ఈరోజు ఆరోగ్యం కొంచెం మెరుగ్గా ఉందని డాక్టర్లు చెప్పారని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున మాగంటికి అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తాం… గోపీనాథ్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అత్యంత సన్నిహితుడు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.