రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తాం : శ్రీధర్‌ బాబు

-

తెలంగాణలో రైతులను వ్యాపారవేత్తలుగా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి, ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను కోరారు. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో పార్క్‌ హయత్‌లో నిర్వహించిన ‘‘ఇండియా – లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్’’ రెండో ఎడిషన్‌లో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను ఈ భేటీలో పాల్గొన్న పలు కంపెనీల ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మనకు మేలే చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారని తెలిపారు. ఈ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకుని ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news