కేంద్రమంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.  ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావుల మధ్య నిత్యం ఏదో విషయం పై సవాళ్లు, ప్రతీ సవాళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాజా  హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని బండి సంజయ్ పేర్కొన్న విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ వేదిక గా కౌంటర్ ఇచ్చారు. రైతులకు ఫించన్, 2 కోట్ల ఉద్యోగాలు, అకౌంట్లలో 15లక్షలు, ఇలా బీజేపీ ఎగ్గొట్టిన హామీలు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని దుయ్య బట్టారు. 10నెలల ప్రజా ప్రభుత్వం పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయన్నారు. చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడాలని హితవు పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version