శ్రీశైలంలో తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…ప్రత్యక్షం అయ్యారు. SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగిరావాలని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

మహాశివరాత్రి సందర్బంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని.. SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా తిరిగి రావాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. లక్షలాది మంది రైతులు, ఫ్లోరైడ్ భాదితుల జీవితాలను మార్చే టన్నెల్ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి వేడుకోవడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.