వాస్తు ప్రకారం కట్టుకున్న సచివాలయానికి ఇప్పటినుండి అయినా సీఎం కేసీఆర్ వస్తారనే నమ్మకం లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలం కొండగడపలో కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 9 ఏళ్ల తర్వాత రాజభవనం లాంటి సెక్రటేరియట్ కట్టుకొని కుర్చీలో కూర్చొని సీఎం కేసీఆర్ సంతకం చేశారని అన్నారు. పేరుకు 1000 కోట్లు అంటున్నారు కానీ రెండు వేల కోట్లతో రాజభవనం కట్టుకున్నారని ఆరోపించారు.
మంచి భవనం కూలగొట్టి సెక్రటేరియట్ కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊర్లలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పిల్లలకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కానీ.. సెక్రటేరియట్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. ఆయన ఇప్పటికైనా సచివాలయానికి వస్తారనే నమ్మకం లేదన్నారు కోమటిరెడ్డి. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడితే సరిపోదని.. అణగారిన వర్గాలను అభివృద్ధి చేయాలని సూచించారు.