ఇకనైనా ఢిల్లీలో ఫిర్యాదులు చేయడం మానేయండి.. కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్

-

శుక్రవారం బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు కరీంనగర్ ఎంపీ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఇకనుంచి అయినా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలని అన్నారు. కనీసం కిషన్ రెడ్డి నైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండని సూచించారు.

అధ్యక్షులుగా ఉన్న వారిపై తప్పులు చూపడం బంద్ చేయాలని సూచించారు. తాను అధ్యక్షుడిని అయ్యాక చాలామంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని, నాన్ బెయిలబుల్ కేసులు వారిపై ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక పాత బస్తీలోని కార్యకర్తలు హీరోలని అభివర్ణించారు బండి సంజయ్. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మీటింగ్ పెట్టిన దమ్ము ఎవరికీ లేదని అన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఫోటోలు మొదటి పేజీలో రాకూడదని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకే పిఆర్సి అంటూ చెబుతున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు.

కెసిఆర్ దరిద్రమైన ముఖాన్ని మొదటి పేజీలో చూపించాలనుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేల కేసీఆర్ నటించడం కాదు.. జీవిస్తున్నాడని దుయ్యబట్టారు. గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునేంతవరకు బిజెపి కార్యకర్తలు విడిచిపెట్టరని అన్నారు. ఇకనుంచైనా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version