గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పట్టు వదలని విక్రమార్కుడిలా వర్షాలు ఆగడం లేదు. ఒకరోజు కొన్నూయి జిల్లాలు మరొక్క రోజు మరికొన్ని జిల్లాలు ఇలా వాయిదాల పద్దతిలో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. ఇక రెండు రోజుల నుండి హైదరాబాద్ సిటీని సైతం ముంచెత్తుతోంది వర్షం. స్పందించిన ప్రభుత్వం స్కూల్స్ , కాలేజీలు, ఇట్ కంపెనీ లు అన్నిటికీ సేవలను ప్రకటించింది. కాగా తాజాగా GHMC మరో కీలక ప్రకటన చేసింది. మేయర్ విజయలక్ష్మి ఇంకా 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంటి నుండి బయటకు రావద్దు అంటూ సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ , మేడ్చల్ మరియు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఈ వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. ఏ ప్రాంతంలో అయినా చెట్లు కూలడం మరియు వరదలు ఎక్కువ ఉంటే నిన్న ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చెయ్యాలని GHMC సలహా ఇచ్చింది.
మరో 24 గంటలు భారీ వర్షాలు … GHMC కీలక ప్రకటన !
-