ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఈ ప్రాంతాలకు పోదామా..

-

వేసవి కాలం వచ్చింది అంటే చిన్నా, పెద్దా, ముసలి ముతక అందరు కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు..అలాంటి సమయంలో చల్లని ప్రదేశాలకు వెళ్ళి వద్దామని చాలా మంది అనుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఊటి నో హిమాలయాలకో ఫ్యామిలీతో ట్రిప్ వేసుకుంటారు.. లేని వాళ్ళు లోకల్ లో ఉండే వాటిని చూడాలని అనుకుంటారు.హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో మనుషులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు గ్రీన్ మ్యాట్‌లు, కూలర్లు, ఏసీలు వినియోగించినప్పటికీ లాభం లేకుండా పోతోంది. చల్లని ప్రాంతాలకు వెళ్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతోంది.

ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. హైదరాబాద్ చుట్టు పక్కలా చల్లని ప్రదేశాలున్నాయి.. అవేంటో ఓ లుక్ వేసుకోండి..

శామీర్‌పేట్ లేక్..

ఇది మంచి పిక్నిక్ స్పాట్. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని పొందొచ్చు. అంతే కాదు మీతో పాటు మీ పెంపుడు జంతువులను కూడా అక్కడికి తీసుకెళ్లి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. శామీర్‌పేట్ చెరువుకు సమీపంలోని జింకల పార్కు ఉంది. ఈ పార్కు లో కృష్ణ జింకలు ఉంటాయి. పిల్లలకు ఈ పార్కు చాలా బాగుంటుంది.

దుర్గం చెరువు..

హైదరాబాదీలకు ఇది కొత్తేం కాదు.. చెరువును, పార్కును సుందరీకరించిన తర్వాత పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఫోటోషూట్‌కు కూడా ఈ ప్లేస్ ప్రసిద్ధి చెందింది. పచ్చటి చెట్ల మధ్యలో ఏర్పాటు చేసిన బెంచీలపై విశ్రాంతి తీసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్‌లో దుర్గం చెరువుకు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.. ఫోటోలు దిగాలి అనుకుంటే మంచి కెమరాను మీతో తీసుకెళ్లండి..

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గండీపేట్ లేక్ ఉంది. దీన్ని ఉస్మాన్ సాగర్ అని కూడా పిలుస్తారు. హైదరాబాదీలకు ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడ చల్లని వాతావరణం ఉండటంతో ఆహ్లాదకరంగా గడపొచ్చు.. వీటితో పాటు నెహ్రూ జువాలాజికల్ పార్కు, మ్యూజియం లతో ఎన్నో ఫెమస్ ప్రాంతాలు కూడా ఉన్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version