సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు.. నాన్నమ్మ కళ్లలో ఆనందం కోసమే !

-

సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్నాడని చెల్లెలి భర్త కృష్ణ అలియాస్ మాల బంటిని హత్య చేశాడట కోట్ల నవీన్ గౌడ్. నాన్నమ్మ కళ్లలో ఆనందం కోసం ఈ నెల 26న చెల్లి భర్త కృష్ణను గొంతు నులిమి హత్య చేశాడట. ఆ తర్వాత రాత్రంతా డెడ్‌బాడీని కారులో వేసుకుని తిరిగాడట నవీన్ గౌడ్.

suryapet crime update

 

కాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ (30) అలియాస్ మాల బంటి, సూర్యాపేట మండలం పిల్లలమర్రికి చెందిన నవీన్ స్నేహితులు. తరచూ నవీన్ ఇంటికి వస్తూండే కృష్ణ.. అతని సోదరి భార్గవిని ప్రేమించాడు. ఆమె విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. కులాలు వేరు కావడంతో వారు ఒప్పుకోలేదు. వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో కృష్ణ, భార్గవి గత ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ తరుణంలోనే హత్య జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version