మేం ఎవరికి అమ్ముడు పోలేదు..బండి సంజయ్ పై స్వామిగౌడ్ ఫైర్

-

మేం ఎవరికి అమ్ముడు పోలేదు..బండి సంజయ్ పై టిఆర్ఎస్ నేత స్వామిగౌడ్ ఫైర్ అయ్యారు. బిజెపి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై అనేక విమర్శలు చేస్తున్నారని.. ఎవరు ఎవరికి అమ్ముడు పోలేదు…బండి సంజయ్ ఆ కామెంట్స్ ను విత్ డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. మేము అమ్ముడు పోయే వాళ్ళము అయితే, లొంగిపోయే వాళ్ళము అయితే తెలంగాణ ఉద్యమం లో ఉండేవాళ్ళం కాదని చురకలు అంటించారు.

ఉద్యమ సమయంలో మా మీద ఆరోపణ చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ? తెలంగాణ ఉద్యమ సమయంలో మా పై దాడులు జరిగిన రోజున బిజెపి నేతలు ఎందుకు మాట్లాడలేదు ? అని నిప్పులు చెరిగారు. బిజెపి కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్రలో మేము వెంట నడిచామని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థతులు బాగా లేకపోతే జీతాలు ఆలస్యం అవుతాయి…గతంలో కూడా జరిగిందన్నారు.సంఘాలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయని.. గతంలో వరదలు వచ్చినప్పుడు సర్కార్ కు ఒక రోజు జీతం ఇచ్చామని వివరించారు. బిజెపి నేతలు మాటల్తో మిమ్మలి నమ్ముకున్న ఉద్యోగులు కూడా దూరం అవుతారని… చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version