మత్స్య కారులు కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన – తలసాని

-

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…పల్లగుట్ట వద్ద చేపల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… సామాజిక దృష్టి కోణంలో కుల వృత్తులను కేసీఆర్ ప్రోత్సాహిస్తుండని.. 2015 సంవత్సరంలో 3779 చెరువులు ఉండగా ఇప్పుడు 26000 చెరువులలో దాదాపు 25 కోట్ల వ్యయంతో చేప పిల్లలు వదిలామన్నారు.

మత్స్య మిత్ర ఆప్ కూడా రూపొందించామని.. మత్స్య కారులు ఆర్ధికంగా బలోపేతం కావాలి, దళారులకు ఇవ్వొద్దని కోరారు. చేప పిల్లల కౌంటింగ్, నాణ్యత కూడా గమనించి జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు మన ఊరు మన బడి లో భాగంగా విద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని… ఎవరు పడితే వారు టీవీలల్ల దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.

సెంట్రల్ ఫైనాన్సు మినిష్టర్ మోడీ ఫోటో పెట్టాలని అంటున్నారని.. దయచేసి మధ్య దళారులను నమ్మొద్దు, మోసపోవద్దు, ఆర్ధికంగా మత్స్య కారులు నష్టపోవద్దని కోరారు తలసాని. 26000 చెరువులకు జియో టాగ్ చేశాము, ఇవి మీ ఆస్తులు, జాగ్రత్తగా చూసుకోవాలి.. ఇప్పుడు శంఖుస్థాపన చేసిన స్థలం దళితుల భూమి అని తెలిసింది, వీలైతే వేరే జాగలో షెడ్డు వేయాలి అని ఎమ్మెల్యే కోరుతున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version