హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకే ప్రమాదం – బండి సంజయ్

-

ఖైరతాబాద్ వినాయకుడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఇవాళ దర్శించుకోనున్నారు. అయితే.. దీనిపై బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో బడా గణేష్ ని దర్శించుకోవాలని తరుణ్ ఛుగ్ అన్నారు అందుకే వచ్చామని.. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనీ ఒక్క అడుగుతో ప్రారంభమై 68ఏళ్లకు చేరుకుందని తెలిపారు.

శంకరయ్య అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు బడా గణపతిని ముందుకు నడిపిస్తున్నారు.. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఐక్యతను తేవడానికి బాలగంగాధర తిలక్ వినాయక నవరాత్రులను ప్రారంభించారని తెలిపారు.

హిందూ సమాజాన్ని ఏక తాటిపైకి తేవడానికి వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం.. విఘ్ననాలను తొలగించే వినాయకుడిని ఎల్లవేళలా కొలవాలని కోరారు. హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకే ప్రమాదం..హిందూ బంధువులు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హిందూ సమాజం అంత సంఘటితం కావాలి.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అందరూ పరిశీలించాలన్నారు. అందరూ సుఖ : సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version