నేటి నుంచి కాంగ్రెస్‌ నిరుద్యోగ నిరసన ర్యాలీలు.. ఇవాళ ఖమ్మంలో ప్రారంభం

-

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్, ఈడీలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. పేపర్ లీక్​పై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్​గా తీసుకుంది. ఈ క్రమంలోనే విద్యార్ధి, నిరుద్యోగ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ… నేటి నుంచి వరుసగా నిరుద్యోగ నిరసన ర్యాలీలు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనుంది.

TSPSC పేపర్‌ లీకేజి ప్రభావం దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులపై పడిందని… కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దీనిపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించడంలో భాగంగా రోజుకొక విశ్వవిద్యాలయాన్నిసందర్శించి అక్కడ నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతారు.

నేడు ఖమ్మంలో సన్నాహక ర్యాలీ నిర్వహిస్తున్నట్లు.. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ తెలిపారు. ఇవాళ ఖమ్మం నగరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ ప్రదర్శన.. మయూరి సెంటర్, పాత బస్టాండ్ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోపాటు… ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news