ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరుకావడం లేదు : జూనియర్ ఎన్టీఆర్

-

హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ సహా సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సాయంత్రం ఘనంగా సన్మానం జరగనుంది. అనంతరం ఎన్టీఆర్‌పై వెబ్‌సైట్, ప్రత్యేక సంచిక ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన సీనియర్ నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వేడుకకు యంగ్ హీరోలు కూడా హాజరవనున్నట్లు సమాచారం. కల్యాణ్‌రామ్‌, పవన్‌ కల్యాణ్, ప్రభాస్, రానా, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి యువతరం హీరోలు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించగా.. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్‌ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version