9వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ఇవాళ వీటిపైనే చర్చ

-

 

తొమ్మిదో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే… శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు కానున్నాయి. నేడు అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై మూడో రోజు చర్చ జరుగనుంది. కాగా, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. అయితే…. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో ఆశలపల్లకిలో దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారట.

revanth in assembly

పరిశీలనలో నలుగురి పేర్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డిల పేర్లు దాదాపు ఖరారు ఉన్నారని అంటున్నారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను తొలగించి విజయశాంతికి, ప్రేమ్ సాగర్ రావులకు అవకాశం ఇస్తారంటూ జోరుగా ప్రచారం అందుతోంది. మరో రెండు మంత్రి పదవులను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కింద ఒకరికి మైనారిటీ, ఎస్టీ కోటా కింద పెండింగ్ పెట్టనున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version