అక్టోబర్ 8-10 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్గడ్ లో అతి త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అక్టోబర్ 8 నుంచి 10వ తేదీ మధ్య CEC షెడ్యూల్ ను ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నవంబర్ నుంచి డిసెంబర్ తొలి వారంలో పోలింగ్, అదే నెల 10-15 మధ్య ఫలితాలు వెలువరించినట్లు సమాచారం. కాగా, TS, MP, రాజస్థాన్, మిజోరాం లలో ఒకే విడతలో, ఛత్తీస్గఢ్ లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
అటు డిసెంబర్ 10-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఢిల్లీలో శుక్రవారం ఈసీ భేటీ అయ్యింది. ఒకే విడతలో తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గడ్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.