తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. 119 నియోజకవర్గాల నుంచి 2,290 మంది అభ్యర్థుల భవితవ్యానికి రేపు పరీక్ష జరగనుంది. గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా.. 3,26,02,799 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఇందుకోసం ఇప్పటికే ఓటర్లకు ఓటింగ్ స్లిప్పులు పంపిణీ చేశారు. కొంతమందికి ఓటర్ స్లిప్పులు అందకపోయి ఉండొచ్చు. అయితే వారు ఆందోళన చెందొద్దు. అలాగని ఓటింగ్‌కు దూరం కావొద్దు. మరేం చేయాలంటే..?
ఓటర్ స్లిప్పులు అందని వారు ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఇలా చేయాలి..
- ఎస్‌ఎంఎస్ ద్వారా: ఓటరు గుర్తింపు కార్డు నంబరును 1950, 92117 28082 నంబర్లకు పంపిస్తే మీ పోలింగ్ కేంద్రం వివరాలు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్) రూపంలో లభిస్తాయి.
- టోల్ ఫ్రీ నంబరు: 24 గంటల పాటు పనిచేసే టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్ చేసి ఓటరు గుర్తింపు కార్డు నంబరు సాయంతో పోలింగ్ కేంద్రం, బూత్ నంబరు, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
- యాప్: ‘ఓటరు హెల్ప్‌లైన్ యాప్’డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు పొందొచ్చు.
- అంతర్జాలం:ఎన్నికల కేంద్రం
- వెబ్‌సైట్ www.ceotelangana.nic.in ద్వారా పోలింగ్ కేంద్రాల చిరునామాలు, వాటి ఫొటోలు, గూగుల్ మ్యాప్ వివరాలు చూసుకోవచ్చు.