తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఆగస్ట్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఆగస్ట్ 3వ తేదీన సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా, బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 12తో ముగిసిన విషయం తెలిసిందే.
6 నెలల గడువు ప్రకారం…. ఆగస్టు 11లోపు ఉభయసభలు తిరిగి సమావేశంకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల రెండో వారంలో అసెంబ్లీ, కౌన్సిల్‌ను సమావేశ పరుస్తారని సమాచారం. వివిధ అంశాలు, రాష్ట్రంలో పరిస్థితులు..సమావేశాల్లో చర్చకు రానున్నాయి. కొన్ని బిల్లులను భారాస సర్కార్ తీసుకొచ్చే అవకాశం ఉంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో…..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.