వరంగల్ నగరాన్ని వీడని వరద ముప్పు ఏ మాత్రం వదలడం లేదు. బోట్లలో ప్రజలను తరలిస్తోంది రెస్క్యూ సిబ్బంది. నిన్న రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి వరంగల్ నగరం వణికింది. చెరువులు పొంగడంతో వచ్చిన వరదనీటితో నగరం నీటిపై తేలియాడినట్టైంది.
ఇంకా పలు కాలనీ జల దిగ్బంధంలోనే ఉండగా దాదాపు 82 కాలనీల వాసులు పూర్తిగా వరదల్లోనే చిక్కుకున్నారు. హనుమకొండలోని జవహర్ నగర్, ఊచమ్మకుంట, భవానీనగర్, సమ్మయ్య నగర్, రాంనగర్ కాలనీలు, వరంగల్లోని హంటర్ రోడ్, సాయినగర్, ఎస్సార్ నగర్, శివనగర్, ఆటోనగర్ ప్రాంతాలు వరద గుప్పిట్లో ఉన్నాయి.