రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు..8 బిల్లులు తీసుకురానున్న ప్రభుత్వం

-

ఇవాళ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇక ఇవాళ తొలుత ప్రశ్నోత్తరాలు ప్రారంభం అవుతాయి. అలాగే… 8 బిల్లులను సభలో ప్రవేశ పెట్టనుంది కేసీఆర్‌ ప్రభుత్వం. చనిపోయిన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపునంది.

ఇవాళ రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగడంతో పాటు.. అకాల వర్షాలు, తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య బలోపేతంపై చర్చ జరుగనుంది. ఇది ఇలా ఉండగా, మొన్న రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే… నిన్న ఒక్క రోజే రూ.41 వేల వరకు రైతు రుణాలు చెల్లింపులు చేసింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ మాట ప్రకారం నిన్న రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీలు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రూ.167.59 కోట్లు చెల్లింపుల కోసం ఆర్థికశాఖ నుంచి విడుదల చేశారు. దీంతో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version