నేటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఉంటుంది. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సభకు వస్తారా? లేదా? అనే అంశం పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. మరి సీఎం మాటను గౌరవించి కేసీఆర్ అసెంబ్లీ సభకు వస్తారా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది.
ఇక అటు తెలంగాణలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. తెలంగాణలో నేడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇవాళ సాయంత్రం పూట తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన అవతరణ దినోత్సవాన్ని నిర్వహించి “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” ఆలాపన చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే.