నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..ముహుర్తం ఎప్పుడంటే ?

-

తెలంగాణలో ఇవాళ కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. తెలంగాణలో నేడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇవాళ సాయంత్రం పూట తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుంది.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన అవతరణ దినోత్సవాన్ని నిర్వహించి “జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం” ఆలాపన చేయాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy is going to unveil the statue of Mother Telangana in Telangana today

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన డిసెంబర్ 9న వెలువడిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఇదే రోజు పండుగల నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయం పైన ఉత్తర్వులు వెలువడగా…. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడనున్నారు. ఇక అటు నేటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవనున్నాయి. మొదటి రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పై ప్రకటన చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news