10 సీట్లు 30 శాతం ఓట్లు.. బీజేపీ లోక్సభ ఎన్నికల టార్గెట్ ఇదే

-

పార్లమెంట్ ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లతో 10సీట్లు గెలవాలని రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. ఈ విజయాన్ని ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. దేశంలో కుటుంబ పాలన అధికారంలోకి రాకుండా ప్రయత్నించాలని చెప్పారు. హైదరాబాద్లో పర్యటించిన అమిత్ షా బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

వర్గ విభేదాలు పక్కన పట్టి కలిసి కట్టుగా పనిచేయాలని బీజేపీ ముఖ్య నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చురకలు అంటించారు. వర్గ విభేదాల వల్లే ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో నష్టపోయామని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపైన మరొకరు తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని అనుకున్న సీట్లు సాధించలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికిపైగా ఓట్లు.. పదికి పైగా స్థానాల్లో విజయం సాధించేలా నేతలంతా సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. అప్పుడే కమల వికాసం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. సిట్టింగ్ ఎంపిలకే ఈ సారి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకు అవకాశం ఇస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version