హస్తినలో ‘టీ’ కమలం..ఏం జరగబోతుంది.?

-

తెలంగాణ బీజేపీ రాజకీయాలు హస్తినకు చేరుకున్నాయి..ఢిల్లీకి తెలంగాణ నేతలు వరుసపెట్టి వెళ్ళడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లొచ్చారు. వీరు ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారడానికి చూస్తున్నారని, అందుకే కేంద్ర పెద్దలు ఢిల్లీకి పిలిచి మాట్లాడారని టాక్ వచ్చింది. అలాగే వారిని బుజ్జగించి…బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు వారికి హామీ ఇచ్చారని తెలిసింది.

ఈ ప్రచారం జరిగిన వెంటనే..ఇక బండి సంజయ్‌ని తప్పిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆయనని కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవడమా? లేదా జాతీయ స్థాయిలో ఏదైనా పదవి ఇవ్వడం గాని చేస్తారని తెలిసింది. ఇక కిషన్ రెడ్డిని అధ్యక్ష పీఠంలో కూర్చోబెడతారని తెలిసింది. ఇదిలా ఉండగానే జులై 8న తెలంగాణకు మోదీ రానున్నారు. ఇక అప్పటికి తాను అధ్యక్షుడు హోదాలో ఉండకపోవచ్చు అని బండి…తన అనుచరుల వద్ద అనడం సంచలనంగా మారింది. దీంతో ఆయనని పదవి నుంచి తప్పిస్తున్నారని తేలిపోయింది.

ఇదే క్రమంలో ఇప్పుడు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలని ఢిల్లీకి పిలిచారు. వారు ఢిల్లీకి వెళ్లారు. ఇక నెక్స్ట్ బండి సంజయ్ ఢిల్లీకి పయనమవుతున్నారు. దీంతో హస్తినలో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. మంత్రి మండలి సమావేశం ముందు..హస్తినలో తెలంగాణ కమలనాథులతో ఎలాంటి రాజకీయం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది.

అయితే పార్టీలో మార్పులు కోసమే బి‌జే‌పి నేతలు వరుసగా ఢిల్లీకి వెళుతున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా అధ్యక్షుడు మార్పు ఉంటుందని, అలాగే ఈటల, కోమటిరెడ్డి, కొండా లాంటి వారికి కీలక పదవులు వస్తాయని తెలుస్తుంది. చూడాలి మరి టీ బీజేపీలో ఎలాంటి మార్పులు జరగనున్నాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version