Telangana Budget 2024 : ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం 2024-25 బడ్జెట్ అంచనా రూ. 2.95 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్లు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రకటించిన చివరి బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు.
ఈ సారి మరో రూ. 10వేల కోట్లు పెరిగి రూ. 3 లక్షల కోట్లను తాకే ఛాన్స్ ఉంది. ఇందులో సంక్షేమ రంగానికి రూ. 40 వేల కోట్లు, వ్యవసాయానికి రూ. 30 వేల కోట్లతో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట సమావేశాలు ప్రారంభం అవ్వగా ఆయన శాసనసభకు హాజరుకాలేదు. కాగా, ఇవాళ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.