తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో రాష్ట్ర కేబినెట్ సభ్యులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇవాళ్టి సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, శాసనసభ ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన సభలో అడుగుపెట్టడం ఇవాళే తొలిసారి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కార ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈనెల 26వ తేదీన అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. తిరిగి 27న పద్దుపై ఉభయ సభల్లో చర్చ జరగుగుతుంది. మళ్లీ 28వ తేదీన ఆదివారం సెలవు ఉంటుంది. 29, 30 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టి.. 31న ద్రవ్యవినిమయ బిల్లు సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో వివిధ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.