ఏపీలో 20 వేల ఉద్యోగాలకు చంద్రబాబు భారీ ప్లాన్‌ !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు మూడో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనుంది SIPB. ఈ సమావేశంలో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Chandrababu’s big plan for 20 thousand jobs in AP

ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. తీవ్ర పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు చంద్రబాబు సూచనలు చేశారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version