దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఏపీలో ప్రారంభం అయ్యాయి. ఈ సేవలను ఐటీశాఖ మంత్రి నారాలోకేశ్ గురువారం ఉదయం ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ సేవలకు గాను గత అక్టోబర్ ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది. కాగా, వాట్సాప్ సేవలు అందుబాటులోకి రావడంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.