తెలంగాణలో ఈనెల 15 నుంచి ‘సీఎం కప్‌’ క్రీడా పోటీలు

-

అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణను క్రీడా రంగంలోనూ నెంబర్ వన్​గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశానికి మేటి క్రీడాకారులను అందించే దిశగా కృషి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా యువ క్రీడారులను ప్రోత్సహించేందుకు ఓ వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. అదే సీఎం కప్ పోటీలు. చీఫ్ మినిస్టర్ కప్-2023 పేరుతో ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు.

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. 10వేల క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 18 క్రీడాంశాల్లో 15 ఒలంపిక్ గుర్తింపు పొందిన ఆటల్లో పోటీ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి విజేతకు రూ.లక్ష, రెండో విజేతకు రూ.75వేలు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీఠ వేస్తోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్ఫూర్తితో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version