తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

-

ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు. సూర్యుని నూతన ప్రయాణం సమాజంలో మార్పునకు నాంది పలకాలని అన్నారు. రాష్ట్రమంతటా సంక్షేమంతోపాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో మొదలైన ప్రజాపాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా సంబురాలు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సకల జనహితానికి, ప్రగతి పథానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కూడా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రజలు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇంకోవైపు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సుఖశాంతుల సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఇవాళ సమీప ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version