టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణ సీఎం కొత్త రూల్.. ఇక అది పక్కా..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి, డ్రగ్స్ వినియోగంపై మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ ఆఫీసులో పోలీసులకు సంబంధించిన కొత్త వాహనాలను ప్రారంభించారు. అనంతరం సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. డ్రగ్స్ నియంత్రణ పై అందరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు. ప్రమాదకరమైన గంజాయి బారిన పడి నేటితరం యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా తోడ్పడాలని కోరారు.

ఈ క్రమంలో సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో సినీ ఇండస్ట్రీ తమ సామాజిక బాధ్యతలను నెరవేర్చట్లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. సమాజం కోసం ఉపయోగపడే వీడియోలను సినిమా ముందు ప్రదర్శించాలని పేర్కొన్నారు. థియేటర్ల యజమానులు కూడా డ్రగ్స్ పై అవగాహన డాక్యుమెంటరీ వీడియోలను ప్లే చేయాలని చెప్పారు. టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్స్ నటీనటులతో 1.5-2 వీడియో తీసుకొచ్చి ఇస్తేనే వారికి వెసులుబాటు ఇవ్వాలని అన్నారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారు. కొంతైనా తిరిగివ్వడం వారి బాధ్యత. సమాజాన్ని కాపాడటంలో వారు భాగమవ్వాలి అని రేవంత్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version